అంబేద్క‌ర్ ను ఆద‌ర్శంగా తీసుకోవాలి : హెల్ప్ వీల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంబ్లే అతీశ్ కుమార్

by Ratna Kumari |

దిశ‌, ఇంద్ర‌వెల్లి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రతీ విద్యార్థి ఆదర్శంగా తీసుకొని, చదువునే ఆయుధంగా చేసుకొని కలలను సాకారం చేసుకోవాలని హెల్ప్ వీల్ ఫౌండేషన్

అంబేద్క‌ర్ ను ఆద‌ర్శంగా తీసుకోవాలి : హెల్ప్ వీల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంబ్లే అతీశ్ కుమార్
X

దిశ‌, ఇంద్ర‌వెల్లి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రతీ విద్యార్థి ఆదర్శంగా తీసుకొని, చదువునే ఆయుధంగా చేసుకొని కలలను సాకారం చేసుకోవాలని హెల్ప్ వీల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంబ్లే అతీశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల-1 లోని అంబేద్కర్ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని హెల్ప్ వీల్ ఫౌండేషన్ తరుపున విద్యార్థులకు పెన్నులు,పెన్సిల్లు, గిర్మిట్, ఏరేసర్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తొలిసారిగా పాఠశాలలో చేరినందుకు నవంబర్ 7న విద్యార్థి దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. సమాజంలో గొప్ప స్థాయిలో ఉండాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఏం జాదవ్ గోవింద్, భీం ఆర్మీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు పరత్వాగ్ సందీప్, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ఉపాధ్యక్షుడు సావంత్ రాజవర్ధన్, దళిత సంఘాల నాయకులు వాగ్మారే శుధ్ధోధన్, పరత్వాగ్ దత్త, హెల్ప్ వీల్ ఫౌండేషన్ సభ్యులు జాందాడే బాలాజీ, సంతోశ్, ఆరిఫ్, గణేశ్ పాల్గొన్నారు.

Next Story