- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
20 ఏళ్ల తర్వాత ఒకే చోట కలిసిన పూర్వ విద్యార్థులు
by Jakkula.Mamatha |
ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ 2005-2006 ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వేడుక ఆదివారం సందడిగా సాగింది

X
దిశ, రెబ్బెన: రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ 2005-2006 ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వేడుక ఆదివారం సందడిగా సాగింది. దాదాపు రెండు దశాబ్దాల కిందట తాము చదివిన రెబ్బెన ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్స్ గా చేసిన చిలిపి, అల్లరి పనులు గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తు చేసుకున్నారు. మృతి చెందిన టీచర్లు, సిబ్బందిని గుర్తు చేసుకొని సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు తమ అనుభవాలను పంచుకున్నారు. కోలాహలంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తోటి స్నేహితులు బ్యాచ్ మేట్స్ అభినందించారు. ఉపాధ్యాయ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించి గురుభక్తి చాటారు.
Next Story






