- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే అన్ని సాధ్యమే : ఐరన్ మ్యాన్ డాక్టర్ బీ. ఎల్. నరసింహారెడ్డి
దిశ ప్రతినిధి, నిర్మల్ : విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే అన్ని సాధ్యమవుతాయని ప్రముఖ న్యూరో వైద్యుడు, ప్రపంచస్థాయి ఐరన్ మ్యాన్ అవార్డు గ్రహీత డాక్టర్ బీ.ఎల్. నరసింహారెడ్డి

దిశ ప్రతినిధి, నిర్మల్ : విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే అన్ని సాధ్యమవుతాయని ప్రముఖ న్యూరో వైద్యుడు, ప్రపంచస్థాయి ఐరన్ మ్యాన్ అవార్డు గ్రహీత డాక్టర్ బీ.ఎల్. నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్ష జూనియర్ కళాశాల విద్యార్థులకు పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి..? భవిష్యత్ కి బాటలు ఎలా వేసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పక్కవారితో చదువులతోపాటు వ్యక్తిత్వ వికాసంపై అంచనా వేసుకోవద్దని, అందరూ సమానమేనన్న ఆలోచనతో చదువుకోవాలని సూచించారు. ఆత్మస్థైర్యంతో చదివే విద్యార్థులకు ఫలితాలు వాటంతట అదే వస్తాయన్నారు. ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ ఆలోచనలు విద్యార్థులు విని వదిలి వేస్తారని, ఆచరణలో పెడితే కచ్చితంగా సక్సెస్ అవుతారని పేర్కొన్నారు. గొప్పవారీ జీవితాలను ఆదర్శంగా తీసుకొని శ్రమను నమ్ముకోవాలని, ఫలితాలు వాటంత అవే వస్తాయని అభిప్రాయపడ్డారు. పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఏకాగ్రత పెంచుకోవాలని సూచించారు. ఇందుకు మెడిటేషన్ యోగ శారీరక వ్యాయామం వంటి అంశాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






