తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌.. ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేలోగా ఇళ్లుగుల్లా..!

by Bhanu |

పట్టణంలోని ఆంధ్రబోర్ లోని ఎయిర్టెల్ టవర్ ఏరియాలో గురువారం రాత్రి చోరీ జరిగింది.

తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌.. ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేలోగా ఇళ్లుగుల్లా..!
X

దిశ, లక్షెటిపేట : పట్టణంలోని ఆంధ్రబోర్ లోని ఎయిర్టెల్ టవర్ ఏరియాలో గురువారం రాత్రి చోరీ జరిగింది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీలో పని చేస్తున్న బొప్పు శ్రీనివాస్ గురువారం తాళం వేసి వెంకట్రావు పేటలో ఓ ఫంక్షన్ కు వెళ్లామన్నారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయన్నారు. సుమారుగా రెండున్నర తులాల బంగారు గొలుసు, ఇరవై తులాల వెండి, రూ. 35 వేల నగదును దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ అల్లం నరేందర్, ఎస్ఐ గోపతి సురేష్, తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


Next Story