శభాష్.. ఆదిలాబాద్ పోలీస్.. సూసైడ్ చేసుకునే యువకుడిని కాపాడిన పోలీసులు..

by Bhanu |   (  Updated:2025-06-13 11:19:34  IST  )

ఆత్మహత్య చేసుకునే ఓ యువకుడిని పోలీసులు కాపాడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

శభాష్.. ఆదిలాబాద్ పోలీస్.. సూసైడ్ చేసుకునే యువకుడిని కాపాడిన పోలీసులు..
X

దిశ, ఆదిలాబాద్ : ఆత్మహత్య చేసుకునే ఓ యువకుడిని పోలీసులు కాపాడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ కు చెందిన మహమ్మద్ పైసల్ కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ గురువారం రాత్రి తన తండ్రికి ఒక వీడియో పంపించి నేను ఇక నుండి మీకు దూరం అవుతున్నాను. నాన్న ఇక సెలవు.. అంటూ ఓ వీడియో సందేశాన్ని పంపించి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

దీంతో ఆందోళనకు గురైన తండ్రి ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి.. తాంసి పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డాడి ప్రాజెక్టు వద్ద బాధితుని సెల్ ఫోన్ సిగ్నల్స్ ను గుర్తించారు. కాగా అర్థరాత్రి పోలీసులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వడ్డాడి ప్రాజెక్టు వద్దకు వెళ్లి వెతకగా బాధితుడు ఆచూకీ లభించినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అయితే.. ఈ నేపథ్యంలో పైసల్ ను తన తండ్రికి అప్పగించినట్లు సీఐ తెలిపారు. దీంతో కుటుంబీకులు పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.

Next Story