అక్రమంగా పశువుల రవాణా.. ఏడుగురిపై కేసు నమోదు..

by Bhanu |

అనుమతులు లేకుండా అక్రమంగా పశువుల రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని జైనథ్ సీఐ సాయినాథ్ హెచ్చరించారు.

అక్రమంగా పశువుల రవాణా.. ఏడుగురిపై కేసు నమోదు..
X

దిశ, ఆదిలాబాద్: అనుమతులు లేకుండా అక్రమంగా పశువుల రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని జైనథ్ సీఐ సాయినాథ్ హెచ్చరించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పిప్పర్ వాడ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. మహారాష్ట్ర నుంచి 10 ఎద్దులను అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు.వాహనాన్ని సీజ్ చేసి ఎద్దులను గోశాలకు తరలించినట్లు సీఐ వెల్లడించారు.ఆయనతో పాటు ఎస్ఐ నసీర్, సిబ్బంది ఉన్నారు.

Next Story