Adilabad: బోథ్ నియోజకవర్గం లో గుప్త నిధుల కలకలం

by Ramesh Goud |

బోథ్ నియోజకవర్గంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి.

Adilabad: బోథ్ నియోజకవర్గం లో గుప్త నిధుల కలకలం
X

దిశ, బోథ్ : బోథ్ నియోజకవర్గంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బోథ్ మండలంలోని సాకేర గ్రామ గుట్ట పైన వ్యవసాయ భూమిలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని మరియు క్షుద్ర పూజలు చేస్తున్నారని ఊరి ప్రజలకు తెలిసింది. దీంతో గ్రామస్థులు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం గుప్త నిధి తవ్వకాలు జరుపుతున్న వారికి తెలియడంతో వారు అక్కడి నుండి పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story