- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియా లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు : ఎస్పీ అఖిల్ మహాజన్
దిశ, గుడిహత్నూర్ : పంచాయతీ ఎన్నికలలో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినవియోగించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

దిశ, గుడిహత్నూర్ : పంచాయతీ ఎన్నికలలో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినవియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మూడో విడత ఎన్నికలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో స్పెషల్ పార్టీ బలగాలతో పురవీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎవరు కూడా సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు చేయవద్దన్నారు. పోలింగ్ కేంద్రం సమీపంలో 100 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు ప్రజలు గుమిగుడి ఉండరాదు అన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు క్యూ లైన్ పాటించాలన్నారు. ఓటర్లు మద్యం బహుమతులు డబ్బులు ప్రలోభాలకు గురికాకుండా నిజాయితీగా ఓటు వేయాలన్నారు. ఓటర్లకు ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహణ టపకాయలు పేల్చొద్దని అన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పీ కాజల్ సింగ్, సీఐ రమేష్, ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు.






