- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆవు దూడను హత్య చేసిన నిందితుడు అరెస్ట్..
ఆవు దూడను హత్య చేసిన నిందితుడు రాథోడ్ సంజయ్ ను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు.

దిశ, ఆదిలాబాద్: ఆవు దూడను హత్య చేసిన నిందితుడు రాథోడ్ సంజయ్ ను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. భోరజ్ మండలం గిమ్మ శివారులో మేత మేస్తున్న ఆవు దూడను గ్రామానికి చెందిన సంజయ్ కత్తితో పొడిచాడని వెల్లడించారు.సీఐ సాయినాథ్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు.ఆవు దూడను చంపి అటవీ జంతువుల మాంసంగా అమ్మడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు.
నిందితుడిపై ఇదివరకే పాత కేసులు ఉన్నాయని,రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. ఈ కేసులో నేరస్తున్ని పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జైనథ్ సిఐ, ఎస్ఐలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ అభినందించారు. ఆవులను చంపిన, అక్రమంగా రవాణా చేసిన, అమ్మిన చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉల్లంఘించిన వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయబడతాయని హెచ్చరించారు.






