నిలిపివేసిన ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీ కొట్టిన టిప్ప‌ర్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బెజ్జూర్: బెజ్జూర్ మండలంలోని రెబ్బెన గ్రామ సమీపంలో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని గురువారం సాయంత్రం టిప్పర్ ఢీ కొట్టింది. టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో అతి వేగంతో కిరణ్

నిలిపివేసిన ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీ కొట్టిన టిప్ప‌ర్
X

దిశ‌, బెజ్జూర్: బెజ్జూర్ మండలంలోని రెబ్బెన గ్రామ సమీపంలో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని గురువారం సాయంత్రం టిప్పర్ ఢీ కొట్టింది. టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో అతి వేగంతో కిరణ్ ట్రాన్స్ పోర్ట్ టిప్పర్ వేగంతో వచ్చి, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. అనంతరం యాప చెట్టును ఢీ కొట్టడంతో అక్కడే ఆగిపోయింది. ద్విచక్ర వాహనం పై ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని రెబ్బెన గ్రామస్తులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపిన టిప్పర్ డ్రైవర్ పై, యజమాని పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story