- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్య
దిశ, గుడిహత్నూర్ : తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని మన్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, గుడిహత్నూర్ : తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని మన్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మన్కాపూర్ గ్రామానికి చెందిన నల్వాడ్ విట్టల్ వ్యవసాయం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుండేవాడు. గత కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్యతో ఇంట్లో తరచూ గొడవపడేవాడు. సోమవారం సాయంత్రం మద్యం తాగి వచ్చాడు. మళ్లీ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని భార్యతో గొడవపడ్డాడు. తన వద్ద డబ్బులు లేవని నువ్వు రోజు ఎందుకు తాగి వస్తున్నావని భార్య అనడంతో భార్యతో గొడవ పడ్డాడు. కోపంలో ఇంటి నుంచి వెళ్లిపోయి రాత్రి 10 గంటలకు పురుగుల మందు తాగానని తన పెదనాన్నకు ఫోన్ ద్వారా తెలిపాడు. వారు హుటా హుటిన విట్టల్ దగ్గరికి వెళ్ళగా పురుగుల మందు తాగి పడి ఉన్నాడు. అది గమనించిన వారు వెంటనే ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.






