- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు
దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పై మంగళవారం లారీని వెనుక నుంచి కారు ఢీ కొన్న ఘటన మండలం లో చోటు చేసుకుంది.

X
దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పై మంగళవారం లారీని వెనుక నుంచి కారు ఢీ కొన్న ఘటన మండలం లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ నుంచి అదిలాబాద్ వైపు వెళుతున్న లారీని బెంగళూరు నుంచి నాగపూర్ వైపు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న కారు అదుపు తప్పి లారీ వెనుక నుండి బలంగా ఢీకొనడంతో కారు ముందరి భాగం డ్యామేజ్ కావడం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు సుదర్శన్, మధు ,మనిషా స్వల్ప గాయాలతో బయటపడడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని వెంటనే హైవే అంబులెన్స్ సిబ్బంది స్వామి, నరేందర్ లు స్పందించి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






