- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదు..! కుష్బూ సుందర్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ లో కుటుంబ పాలన తప్ప దేశానికి చేసిందేమీ లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, నేషనల్ ఉమెన్ కమిషన్ కుష్బూ సుందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్‌లో కుటుంబ పాలన తప్ప దేశానికి చేసిందేమీ లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, నేషనల్ ఉమెన్ కమిషన్ కుష్బూ సుందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గం లో జరిగిన ఇవాళ సభలో ముఖ్య అతిథిగా కుష్బూ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ.. ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్ ను నిలపడమే ధ్యేయంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 400 సీట్లతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నిరంతరం దేశం కోసం పనిచేసే వ్యక్తి ప్రధాని మోడీ అని కొనియాడారు. ప్రధాని భారత్ ను గొప్ప దేశంగా తీర్చిదిద్దారని చెప్పారు. కరోనా సమయంలో అందరికీ ఉచితంగా టీకాలు ఇచ్చామని, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించారని వెల్లడించారు. కేంద్రం మహిళలకు అన్ని రంగాల్లో గొప్ప అవకాశాలను కల్పించిందన్నారు.






