- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాహితీ ఇన్ ఫ్రా స్కామ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన జగపతిబాబు
సాహితీ ఇన్ ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ స్కామ్ కేసులో సినీ నటుడు జగపతిబాబు ఈడీ విచారణకు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: సాహితీ ఇన్ ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ స్కామ్ కేసులో సినీ నటుడు జగపతిబాబు ఈడీ విచారణకు హాజరయ్యారు. సుమారు 4 గంటలపాటు ఈడీ అధికారులు జగపతిబాబును విచారించారు. ఆయన సాహితీ ఇన్ ఫ్రా సంస్థతో జరిపిన లావాదేవీలపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సాహితీ ఇన్ ఫ్రా సంస్థతో తరచూ జరిపిన ఆర్థిక లావాదేవీలపై జగపతిబాబు సరైన సమాధానాలివ్వలేదని సమాచారం. సాహితీ సంస్థను ప్రమోట్ చేస్తూ గతంలో జగపతిబాబు పలు ప్రకటనల్లో నటించారు.
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీ ఇన్ ఫ్రా కంపెనీ కస్టమర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేసి మోసం చేసిన విషయం గతేడాది బట్టబయలైంది. సుమారు రూ.800 కోట్లకు పైగా మోసం చేసినట్లు గుర్తించిన ఈడీ.. సంస్థ మాజీ డైరెక్టర్ పూర్ణచంద్రరావును ఈ ఏడాది ఆగస్టులో అరెస్ట్ చేసింది. సాహితీ ఇన్ ఫ్రా రియల్ ఎస్టేట్ ను ప్రమోట్ చేస్తూ.. యాడ్స్ లో నటించిన జగపతి బాబు ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఏ రియల్ ఎస్టేట్ ను గుడ్డిగా నమ్మకండంటూ వీడియో రిలీజ్ చేశారు. సంస్థ పేరు ప్రస్తావించకుండా.. ఆ సంస్థను నమ్మి మోసపోయినవారిలో తాను కూడా ఉన్నానన్నారు.






