Malla Reddy కి ఏమైంది..? మంత్రిని చూపించాలని TRS కార్యకర్తల ఆందోళన

by Satheesh |
Malla Reddy కి ఏమైంది..? మంత్రిని చూపించాలని TRS కార్యకర్తల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి మల్లారెడ్డికి చెందిన యూనివర్శిటీ, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఆఫీస్, ఆయన బంధువుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు చేస్తోన్న విషయం తెలిసిందే. తెల్లవారుజాము నుండి కొనసాగుతోన్న ఈ తనిఖీల్లో ఐటీ అధికారులు ఇప్పటికే భారీగా డబ్బు సీజ్ చేయడంతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి కొడుకు, అల్లుడు, బంధువుల ఇళ్లలో 50 బృందాలుగా ఏర్పడి అధికారులు ఏకకాలంలో రైడ్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. మంత్రి మల్లారెడ్డిని తమకు చూపించాలని ఆయన ఇంటి వద్దే బైఠాయించారు. లేదంటే తామే ఇంటి లోపలికి వెళ్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు, ఐటీ అధికారుల భద్రతా సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కార్యకర్తలు మల్లారెడ్డి ఇంటి బయట రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తు్న్నారు. దీంతో మల్లారెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read more:

IT Raids On Malla Reddy.. ఏకకాలంలో 50 ప్రాంతాల్లో దాడులు

Next Story