Breaking: తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..?

by Vemula.Srinu Prasad |

తెలంగాణ సచివాయలంలో ప్రమాదం తప్పింది...

Breaking: తెలంగాణ సచివాలయంలో తప్పిన  ప్రమాదం..?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సచివాయలం(Telangana Secretariat)లో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తులోని డోమ్ కింద ఉన్న బీమ్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. దీంతో సచివాలయం కింద ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్(Ramagundam Market Committee Chairman) వాహనం ధ్వంసం అయింది. సచివాలయంలో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy Cm Batti Vikramarka) సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్ష నిర్వహించిన అనంతరం పెచ్చులూడిన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.


అయితే ఈ సచివాలయాన్ని గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. కానీ సచివాలయ నిర్మాణంలో పలు సమస్యలు ఉన్నట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. సచివాలయం నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister KomatireddyVenkat reddy) కూడా ఆరోపణలు చేశారు. తన ఛాంబర్‌తో పాటు టాయ్‌లెట్స్‌లోనూ శబ్ధాలు వస్తున్నాయని స్వయంగా అధికారులకు తెలిపారు. అయితే అదంతా ఇంటర్‌నల్‌గా జరిగింది. కానీ ఈసారి సచివాలయం సౌత్, ఈస్ట్ ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వెళ్లే చోట ప్రమాదం జరిగింది. అక్కడే మంత్రులు, అధికారులు వాహనాలు పార్క్ చేసిన ఉంటాయని చెబుతున్నారు. అయితే ఐదవ అంతస్తు నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారీస్ ఊడి పడిందని అంటున్నారు. పెద్ద ఎత్తన శబ్ధాలతో పెచ్చులూడిపడటంతో అధికారులు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Next Story