రాష్ట్రవ్యాప్తంగా.. 'ప్రభుత్వ వసతి గృహాల'పై ఏసీబీ రైడ్స్!

by Geesa Chandu |   (  Updated:2024-08-13 07:54:11  IST  )

ఏసీబీ అధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్టల్స్ పై మంగళవారం ఏకకాలంలో రైడ్స్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా.. ప్రభుత్వ వసతి గృహాలపై ఏసీబీ రైడ్స్!
X

దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ అధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్టల్స్ పై మంగళవారం ఏకకాలంలో రైడ్స్ చేశారు. అధికారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలపై.. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు.హైదరాబాద్ మల్లాపూర్ బీసీ బాలుర వసతి గృహంలో సోదాలు జరిపారు. మంచిర్యాల జిల్లాలో వేమనపల్లి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. దీంతో పాటు సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ మహాత్మాగాంధీ గురుకులంలో ఏసీబీ డీఎస్పీ ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. ర్యాండం వ్యవస్థలో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వసతీ గృహాలలో సోదాలు జరిపారు అధికారులు. వీటితో పాటు హాస్టల్స్ లో విద్యార్థులకు గల సౌకర్యాలు, స్టూడెంట్స్ సంఖ్య, ఇంకా ఇతర రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వసతి గృహంలో ఆహార మెనూ, వంట సరుకులు, ఆహార నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు పరిశీలిస్తునారు. అవినీతికి పాల్పడిన వసతీ అధికారులపై ఇన్స్టంట్ యాక్షన్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారితో పాటూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాల జిల్లా మెట్ పల్లి లోని పెద్దాపూర్ గురుకులానికి వెళ్లనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా పెద్దాపూర్ గురుకులంలో గత కొన్ని రోజులుగా వరుస పాముకాట్ల ఘటనలు జరిగి కొందరు విద్యార్థులు మరణించారు. ఈ సమయంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చెయ్యటంతో ప్రభుత్వం స్పందించింది. దీంతో డిప్యూటీ సీఎం మరియు మంత్రి స్వయంగా అక్కడికి వెళ్లి గురుకుల పాఠశాలను సందర్శించడానికి బయలుదేరి వెళ్లారు.

Next Story