- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచి రేవులలో ఏసీబీ తనిఖీలు
by Ratna Kumari |
నెల రోజుల క్రితం రూ.60 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్‌రెడ్డి వ్యవహారం మరింత మలుపు తిరిగింది.

X
దిశ, గండిపేట : నెల రోజుల క్రితం రూ.60 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్‌రెడ్డి వ్యవహారం మరింత మలుపు తిరిగింది. ఏసీబీ నిర్వహించిన లోతైన విచారణలో ఆయన భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం లభించడంతో అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం నార్సింగి సర్కిల్ పరిధిలోని మంచిరేవులలోని వెంకట్‌రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన మరికొన్ని ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Next Story






