మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ABVP కార్యకర్తల యత్నం.. తీవ్ర ఉద్రిక్తత, తోపులాట

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌‌మెంట్ (Fee reimbursement) బకాయిలపై రచ్చ కొనసాగుతూనే ఉంది.

మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ABVP కార్యకర్తల యత్నం.. తీవ్ర ఉద్రిక్తత, తోపులాట
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌‌మెంట్ (Fee reimbursement) బకాయిలపై రచ్చ కొనసాగుతూనే ఉంది. నవంబర్ 1 నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.900 కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్‌ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఇప్పటకే హెచ్చరించింది. ఈ మేరకు జనరల్‌ బాడీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్‌ (Karimnagar) పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, స్కాలర్‌షిప్స్ వెంటనే విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఏబీవీపీ (ABVP) కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఇంటిని ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే వారిని అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోగా ఇరు పక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసుల అరెస్ట్ చేసిన స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story