బీఆర్ఎస్ కు ఓటు వేయలేదని సినీ కార్మికులపై హరీష్ రావుకి అక్కసు

by velandi.Saikiran |

టిక్కెట్ ధరల పెంపుపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్​రావు చేసిన కామెంట్లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.

బీఆర్ఎస్ కు ఓటు వేయలేదని సినీ కార్మికులపై హరీష్ రావుకి అక్కసు
X

దిశ, తెలంగాణ బ్యూరో : టిక్కెట్ ధరల పెంపుపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్​రావు చేసిన కామెంట్లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. సినిమా ప‌రిశ్రమ పైన మాజీ మంత్రి హ‌రీష్ రావు చిలుక‌ప‌లుకులు ప‌లుకుతున్నాడు.. ప్రిమియర్ షో విష‌యంలో ఏదో జ‌రుగుతుంద‌ని హ‌రీష్ రావు అమాయ‌కంగా మాట్లాడుతున్నాడు.. హరీష్ రావు.. ముందు మీ ఇంట్లో సినిమా గురించి ఆలోచించు..లేకుంటే నీ కథ క్లైమాక్స్ కు చేరుకుంటుంది అని ఆది శ్రీనివాస్ చురకలు అంటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సినిమా కార్మికులు బీఆర్ఎస్ కు ఓట్లు వేయలేదన్న అక్కసు తో హరీష్ రావు మాట్లాడుతున్నాడు.. సినిమా ప‌రిశ్రమ ప‌చ్చగా ఉండ‌టం చూడ‌లేక పిచ్చి మాట‌లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. గ‌త ప‌దేళ్లలో అనేక ప్రీమియర్ షో లకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.. హీరోలు, నిర్మాతల ప్రయోజనం కోసమే కేసీఆర్, కేటీఆర్ ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చారు..

మా ప్రభుత్వం నటులు, నిర్మాతలను కాపాడుకుంటూనే కార్మికుల సంక్షేమ గురించి ఆలోచిస్తుందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మా ప్రభుత్వం కూడా ప్రీమియర్ షో లకు అనుమతి ఇవ్వడంతో పాటు ఈ షోల ద్వారా వచ్చే డబ్బులో 20 శాతం సినిమా కార్మికుల సంక్షేమ నిధికి వెళ్లేలా జీవో ఇచ్చింది.. సినిమా కార్మికులకు ఆరోగ్య భద్రత కార్డులు మంజూరు చేస్తున్నాం.. వాళ్ల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం..వాళ్ల జీతభత్యాలు పెరగానికి నిర్మాతలు చర్చలు జరిపామన్నారు. మీకు సినిమా వాళ్ల గెస్ట్ హౌస్ లు, ఫిలిం పంక్షన్ లు మాత్రమే తెలుసు..మా సీఎంకి సినిమా కార్మికుల కష్టాలు తెలుసు.. చ‌రిత్రలో ఎప్పుడూ లేని విధంగా సినిమా కార్మికుల‌తో స‌మావేశ‌మైన మొద‌టి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్ల సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాలు ప్రక‌టించామని, తెలుగు సినిమా పరిశ్రమను ఎలా ముందుకు తీసుకెళ్లాలో మా సీఎంకి తెలుసని ఆది శ్రీనివాస్ చెప్పారు. సినిమా కార్మికుల సంక్షేమమే పరమావధిగా మా సీఎం ముందుకు వెళ్తున్నారు.

గద్దర్ పేరుతో సినిమా అవార్డులను మా ప్రభుత్వం తీసుకువచ్చింది.. ఫోర్త్ సిటీలో ఫిలిం సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ప‌దేళ్లలో ఏ నాడు చిత్రప‌రిశ్రమ‌ను ప‌ట్టించుకోని బీఆర్ఎస్ నాయ‌కులు ఇప్పుడు తెగ ప్రేమ చూపిస్తున్నారని, రాచ‌కొండ గుట్టల్లో ఫిలిం సిటీ క‌ట్టిస్తామ‌ని ప్రగ‌ల్భాలు ప‌లికి క‌నీసం చిన్న రాయి కూడా తీయ‌లేదని ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ప‌దేళ్ల పాటు సినిమా వాళ్లకు నంది అవార్డులు ఇవ్వకుండా అవమానించిన చ‌రిత్ర కేసీఆర్ దని, ఇవ‌న్ని మ‌రిచిపోయి హ‌రీష్ రావు ఇప్పుడు వారికి మంగ‌ళ‌హారుతులిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రిమియర్ షో లకు అనుమతి విషయంలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం నడుచుకుంటుంది..ఈ విషయంలో కోర్టు ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Next Story