కేసీఆర్ పెళ్లి ఈ గుడిలోనే అయింది.. కానీ అభివృద్ధి శూన్యం: ఎమ్మెల్యే

by Gantepaka Srikanth |

కేసీఆర్ పెళ్లి ఈ గుడిలోనే అయింది.. కానీ అభివృద్ధి శూన్యం: ఎమ్మెల్యే

కేసీఆర్ పెళ్లి ఈ గుడిలోనే అయింది.. కానీ అభివృద్ధి శూన్యం: ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలు కేసీఆర్(KCR), కేటీఆర్‌(KTR)పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా సెంటర్ వద్ద మాట్లాడారు. కేటీఆర్ పగటి కలలు కంటున్నాడని విమర్శించారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో సారు, కారు, పదహారు అని దెబ్బతిన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలు గెలుస్తామని చెప్పి చిత్తుగా ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు లేరు. జూబ్లీ‌హిల్స్‌లోనూ దెబ్బతిన్నారు. అయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. వేల కోట్లు దోచుకుని.. ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రోజు కూడా విరామం తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన చూసే.. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ పార్టీ 5500 పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 65 శాతం సీట్లు వచ్చాయని అన్నారు. సిరిసిల్లలో ఒక్క మండలంలో ఎన్నికలు జరిగితే కేటీఆర్ విజయోత్సవ సభ పెట్టడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తుంటే కేటీఆర్ కడుపు మండిపోతోందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడం ఇదే తొలిసారి అయినా.. వందల కోట్లతో వేములవాడలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను.. వేములవాడకు నూలు డిపో తీసుకొచ్చానని ఆది శ్రీనివాస్ గుర్తుచేశారు.

గతంలో నా పెళ్లి ఇక్కడే అయింది.. వేములవాడ ఆలయాన్ని వంద కోట్లతో అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాటిచ్చాడు.. కానీ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రాజన్నకు శఠగోపం పెట్టాడని అన్నారు. ఇప్పుడు మళ్లీ తామే రూ.150 కోట్లతో వేములవాడ రాజన్న ఆలయాన్ని పునర్:నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌దే విజయమని చెప్పారు.

Next Story