- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sarpanch Election: రష్యా నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న యువతి
కొంత మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇష్టపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కొంత మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇష్టపడ్డారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, తెలంగాణలో జరిగే రెండో విడత ఎన్నికల కోసం ఒక యువతి వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబుద గ్రామానికి చెందిన మానస, రష్యాలో ఎంబీబీఎస్ చదువుతోంది. సెలవులకు స్వగ్రామానికి వచ్చిన ఆమె, తన ఓటు హక్కును వినియోగించుకుంది. యువత తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కాగా, యువతి నిబద్దతపై గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.
కాగా, తెలంగాణలో రెండో విడత ఎన్నికలు కౌంటింగ్ ఫలితాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. దీంతో ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని వారి ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 192 మండలాల్లోని 3,911సర్పంచ్ లు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి.






