సిరిసిల్లలో కేటీఆర్ కు షాక్!

by Muthe.Rajitha |

స్వంత ఇలాకాలో కేటీఆర్ కు చుక్కెదురైంది.

సిరిసిల్లలో కేటీఆర్ కు షాక్!
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: స్వంత ఇలాకాలో కేటీఆర్ కు చుక్కెదురైంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు సుభాష్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభంతో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం సిద్ధం చేసింది. కాగా కమ్యూనిటీ హాల్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండగా తీరా సమయానికి మున్సిపల్ అధికారులు భవనానికి తాళాలు వేశారు. అయితే పాలకవర్గం పదవీకాలం ఈనెల 26 తో ముగుస్తుండటంతో స్థానిక కౌన్సిలర్ తన హయాంలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. మున్సిపల్ అధికారులు కమ్యూనిటీ హాల్ తాళాలు వేయడం ఇప్పుడు జిల్లా కేంద్రంలో చర్చనీయాంశం అయ్యింది. కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్ ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. కాగా కేటీఆర్ కు చెక్ పెట్టేందుకే కమ్యూనిటీ హాల్ భవన ప్రారంభోత్సవాన్ని, కాంగ్రెస్ నేతలు ఆపి ఉంటారని స్థానిక బిఆర్ఎస్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కమ్యూనిటీ భవనాన్ని సదరు గుత్తేదారు నాణ్యత లోపంతో నిర్మించారని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు అందడంతో ప్రారంభోత్సవాన్ని ఆపినట్లు విశ్వసనీయ సమాచారం.

Next Story