ఫోన్ రావడంతో, హీటర్ చంకలో పెట్టుకొని.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

by Geesa Chandu |   (  Updated:2024-08-12 04:58:21  IST  )

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం ఖమ్మంలో జరిగింది.

ఫోన్ రావడంతో, హీటర్ చంకలో పెట్టుకొని.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం ఖమ్మంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని కాల్వవడ్డు హనుమాన్ గుడి సమీపంలో నివసించే దోనెపూడి మహేష్ బాబు (40) కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటాడు. తన పెంపుడు కుక్కకు స్నానం చేయించాలని నీటిని వేడిచేసేందుకు హీటరును పెట్టాడు. ఈ సమయంలోనే తనకు ఫోన్ రావటంతో.. ఫోన్ మాట్లాడుతూ హీటరును నీటిలో బదులు, తన చంకలో పెట్టకున్నాడు. తీవ్ర విద్యుత్ ఘాతానికి గురైన మహేష్ అక్కడే పడిపోయాడు. దీన్ని గమనించిన తన కుమార్తె, వెంటనే కేకలు వేయటంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు మహేష్ బాబును ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించటంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు.

Next Story