హైద‌రాబాద్ లో మ‌రో భారీ అగ్ని ప్ర‌మాదం..ఎగిసిప‌డుతున్న మంట‌లు

by velandi.Saikiran |   (  Updated:2025-11-24 18:10:08  IST  )

గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో ( Gomathi Electronics store ) మంటలు ఎగిసిపడుతున్నాయి. షాప్ క్లోజింగ్

హైద‌రాబాద్ లో మ‌రో భారీ అగ్ని ప్ర‌మాదం..ఎగిసిప‌డుతున్న మంట‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: హైదరాబాద్ మహానగరంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. పాతబస్తీ సమీపంలోని శాలిబండ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికంగా ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో ( Gomathi Electronics store ) మంటలు ఎగిసిపడుతున్నాయి. షాప్ క్లోజింగ్ సమయంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో ఆ షోరూంలో పనిచేసే సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి, మంటలు ఆర్పుతోంది. అటు అంబులెన్సులో గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.

ఈ అగ్నిప్రమాదం ఎఫెక్ట్ కారణంగా ఆ షోరూంలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పేలిపోయాయి. ముఖ్యంగా ఏసీలు, వాషింగ్ మిషన్లకు సంబంధించిన కంప్రెష‌ర్లు పేలిపోతున్నాయట. దీంతో మంటలు మరింత చెలరేగుతున్నట్లు తెలుస్తోంది. అటు భారీగానే ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.అగ్నిప్రమాదం కారణంగా ఎలక్ట్రానిక్స్ షోరూం చుట్టుపక్కల ఉన్న నివాసం ఉంటున్న వాళ్ల‌ను ఖాళీ చేయిస్తున్నారు స్థానిక పోలీసులు. అలాగే ఈ షోరూం స‌మీపంలో ఉన్న రోడ్లన్నీ బ్లాక్ చేసి, జనాలు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. క్లిక్

Next Story