నాంపల్లి స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ బోగీలో చెలరేగిన మంటలు

by Ramesh Naini |

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. జైపూర్ వెళ్లేందుకు నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ‘బీ1’ ఏసీ బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

నాంపల్లి స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ బోగీలో చెలరేగిన మంటలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. జైపూర్ వెళ్లేందుకు నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ‘బీ1’ ఏసీ బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

Next Story