Breaking: చార్మినార్ వద్ద తప్పిన పెను ప్రమాదం

by Vemula.Srinu Prasad |

హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ వద్ద పెను ప్రమాదం తప్పింది.

Breaking: చార్మినార్ వద్ద తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: చార్మినార్(Charminar) వద్ద పెను ప్రమాదం తప్పింది. మినార్(Minar) నుంచి పెచ్చులు(Scales) ఊడిపడ్డాయి. భాగలక్ష్మి ఆలయం(Bhagalakshmi Temple) వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు పడటంతో పర్యాటకులు పరుగులు తీశారు. ఈ మినార్‌కు అధికారులు గతంలో రిపేర్లు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్(Hyderabad) నగరంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఏకధాటిగా వర్షం కురిసింది. వర్షం దెబ్బతో చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడినట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు చార్మినార్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను తీసి వేసి అక్కడ క్లీన్ చేశారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. మినార్‌కు మరోమారు మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు.

Next Story