- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త బైక్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్తుండగా ఢీకొన్న లారీ.. యువకుడు స్పాట్ డెడ్
by Sathputhe Rajesh |
కొత్త బైక్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్న యువకుడిని లారీ బలంగా ఢీకొట్టింది.

X
దిశ, కౌడిపల్లి: కొత్త బైక్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్న యువకుడిని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కౌడిపల్లి మండలం తునికి సమీపంలోని ఇస్సార్ పెట్రోల్ బంకు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లికి చెందిన సుంచు అశోక్ (28) బైక్ రిజిస్ట్రేషన్ కోసం నర్సాపూర్ వెళ్లి తిరుగు ప్రయాణం ఇంటికి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో మృతుడు అశోక్ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అశోక్ పెళ్లి అయి నెలరోజులు కూడా గడవకముందే మృతి చెందడంతో కుటుంబీకుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
Next Story






