HYD: సీఎం ప్రజా దర్బార్‌కు పోటెత్తిన ప్రజలు

by GSrikanth |   (  Updated:2023-12-08 05:14:28  IST  )

ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

HYD: సీఎం ప్రజా దర్బార్‌కు పోటెత్తిన ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. శుక్రవారం ఉదయం అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా.. సీఎం ప్రజా దర్బార్‌లో సమస్యలు చెప్పుకునేందుకు భారీగా అక్కడకు ప్రజలు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే నుంచి భారీగా క్యూ కట్టారు. కొద్ది సేపటి క్రితమే అక్కడకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు విని, వినతులు స్వీకరించి, పరిష్కారానికి కృషి చేయనున్నారు.


Read More..

తెలంగాణలో తొలి ఉద్యోగం పొందిన ఆ యువతి జీతం ఎంతో తెలుసా?

సొంత వాహనంలోనే ప్రజా దర్బార్‌కు CM రేవంత్ రెడ్డి

Next Story