- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆవిర్భావం రోజు కూడా జై తెలంగాణ అనలేని మూర్ఖుడు!.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
దశాబ్ది ఉత్సవాలను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి మూర్ఖుడని, మేము ప్రభుత్వంలో ఉంటే నెలరోజుల పాటు సంబరాలు నిర్వహించే వాళ్ళమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దశాబ్ది ఉత్సవాలను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి మూర్ఖుడని, మేము ప్రభుత్వంలో ఉంటే నెలరోజుల పాటు సంబరాలు నిర్వహించే వాళ్ళమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగరవేసిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి జక్పాట్ ముఖ్యమంత్రి అని, ఆయనకి తెలంగాణా ప్రజల త్యాగాలు, ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సైతం జై తెలంగాణ అనలేని మూర్ఖుడు అని, ఈ రోజు తన శుభాకాంక్షల సందేశంలో కూడా ఎక్కడా జై తెలంగాణ అనలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాలను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేశారని, మేము ప్రభుత్వంలో ఉంటే నెలరోజుల పాటు సంబరాలు నిర్వహించే వాళ్ళమని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం జరిగి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మా పార్టీ తరఫున, 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసి చివరికి ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ వందనాలు తెలిపారు. 2001లో మలి దశ ఉద్యమంతో కొత్త విప్లవాన్ని సృష్టించి, చరిత్రను మలుపు తిప్పి, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు పురుడు పోసినది కేసీఆర్ గారేనని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం కోసం అయితే ప్రాణ త్యాగాలు జరిగాయో అవన్నీ ఫలించి దశాబ్ద కాలం పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని, తెలంగాణ ఆచరిస్తది దేశం అనుసరిస్తది అన్న తీరుగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇక 25 సంవత్సరాలలో కేసీఆర్ గారితో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, యువకులు, సబ్బండ వర్గాల వారందరికీ పేరుపేరునా హృదయపూర్వక తెలంగాణ శుభాకాంక్షలు తెలిపారు. ఇక పండగ వాతావరణం జరుపుకుంటున్న ఈ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని కేటీఆర్ కోరుకున్నారు.






