TG Liquor Shops: ఇవాళే లాస్ట్.. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

by Gantepaka Srikanth |

తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపుల(Liquor Shops) నిర్వహణకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.

TG Liquor Shops: ఇవాళే లాస్ట్.. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపుల(Liquor Shops) నిర్వహణకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈసారి ఎక్సైజ్ శాఖ(Telangana Excise Department)కు ఆశించిన స్థాయిలో దరఖాస్తుల ద్వారా ఆదాయం వస్తు్న్నట్లు కనిపించడం లేదు. అధికారులంతా ఇవాళ చివరి రోజుపైనే ఆశలు పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తదితరాల కారణంగా తప్పనిసరి దరఖాస్తులు వస్తాయన్న ఆశతో ఉన్నారు. అయితే శనివారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండుతో అఖిలపక్షాలు బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ ప్రభావం దరఖాస్తులపై పడినట్లు తెలుస్తోంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా శనివారం సాయత్రం నాలుగు గంటల వరకు దాదాపు 12 వేల అప్లికేషన్స్ వచ్చినట్లు ఎక్సయిజ్ అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇంకా అప్లికేషన్స్ స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. నిన్నటి వరకు 50 వేల ధరఖాస్తులు రాగా, ఇవాళ చివరి రోజు రావడంతో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story