- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపాలిటీల విలీనంపై సమగ్ర అధ్యయనం.. ఆ తర్వాతే అధికారిక ఉత్తర్వులు
జీహెచ్ఎంసీలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) ప్రాంతం వరకు విస్తరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) ప్రాంతం వరకు విస్తరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీన్ని జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం సైతం ఆమోదించింది. 27 మున్సిపాలిటీల ను విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆ దేశించింది. అయితే జీహెచ్ఎంసీలో పాలకవర్గం ఉండడం, 27 మున్సిపాలిటీల్లో స్పె షల్ ఆఫీసర్ల పాలన ఉండడంతో విలీనాని కి సంబంధించిన ఇప్పట్లో అధికారిక ఉత్త ర్వులు జారీచేసే అవకాశంలేదు. జీహెచ్ ఎంసీ పాలకవర్గం గడువు 10 ఫిబ్రవరి 2026న ముగియనుంది. అదే రోజు సా యంత్రం స్పెషల్ ఆఫీసర్ పాలనకు సం బంధించిన ఉత్తర్వులు సైతం జారీ చేయనున్నారు.
విలీనంపై అధ్యయనం
2020లో సంభవించిన భారీ వరదల తర్వాత నుంచి ఈ 27 మున్సిపాలిటీల్లో డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు పనులను జీ హెచ్ఎంసీ ఇంజినీర్ల ఆధ్వర్యంలో చేపడుతున్నారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సైతం వీ టికి జీహెచ్ఎంసీతోపాటే టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాగునీటి సరఫరా సైతం జలమండలి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. వీటితోపాటు డ్రెయినేజీ వ్యవస్థ, వరదనీటి కాలువల వ్యవస్థ, రోడ్డు నెట్‌వర్క్, ఆఫీసులు, ఆస్తులు, ఆదాయా లు, ఖర్చులు, ఉద్యోగుల వివరాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి రి పోర్టు ఇవ్వనున్నారు.
అసెంబ్లీలో చర్చ.. ఫిబ్రవరి 10న అపాయింట్ డే
విలీనం గురించి డిసెంబర్‌లో జరిగే శీ తాకాల సమావేశాల్లో చర్చించనున్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవడంతోపాటు సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. మున్సిపాలిటీల విలీనానికి సంబంధిం చి 10 ఫిబ్రవరి 2026 రోజునే ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు జీహెచ్ఎంసీలో వి లీనం అయినట్టు ‘అపాయింట్ డే’గా ప్రకటించనున్నారు. ఆ రోజు నుంచే 27 ము న్సిపాలిటీల్లోని అన్ని రకాల ఫైళ్లను జీహెచ్ ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. 2007లో జీహెచ్ఎంసీగా ఏర్పా టు చేసిన సమయంలో 12 మున్సిపాలిటీలకు చెందిన ఫైళ్లను ఏవిధంగా స్వాధీనం చేసుకున్నారో అదే తరహాలో ఫైళ్లకు సీల్ వేసి స్వాధీనం చేసుకోనున్నారు. రికార్డుల స్వాధీన ప్రక్రియ జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో జరగనుంది.
విలీనం తర్వాతే బడ్జెట్
జీహెచ్ఎంసీ చట్టం–1955 ప్రకారంగా నవంబర్ 10వ తేదీ వరకు వార్షిక బడ్జె ట్ అంచనా నివేదికను స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టాలి. స్టాండింగ్ కమిటీలో చర్చించి సవరణల తర్వాత చేర్పులు, మార్పులతో కూడిన బడ్జెట్‌ను డిసెంబర్ 10వ తేదీలోపు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ ఆమోదం పొందిన వార్షిక బడ్జెట్ అంచనాల ప్రతిపాదనల ప్రతులను ప్రతి కార్పొరేటర్‌కు డిసెంబర్ 15 లోపు అందజేయాల్సి ఉంది. డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 20 లోపు జీహెచ్ఎంపీ ఆమోదించాల్సి ఉంది. అనంతరం మార్చి 1 లోపు ప్రభుత్వానికి నివేదించా ల్సి ఉంటుంది. బడ్జెట్ ఆమోదించిన తర్వాత మరోసారి రూపొందించడానికి అవకాశంలేదు. అందుకే వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.






