- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‍కు బిగ్ షాక్.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‍లో చేరికకు ముహూర్తం ఫిక్స్!
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. బీఆర్ఎస్‍లో చేరేందుకు మూహుర్తం ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‍కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్‍లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 25 న ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలోని పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు నియోజకవర్గ నేతల టాక్. ఈ మేరకు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍తో జీవన్ రెడ్డి భేటీ అయి పార్టీలో చేరిక అంశంపై చర్చలు జరిపినట్లు జిల్లా వ్యాప్తంగా గుప్పుమంది. తన పార్టీ మార్పుపై తన సన్నిహితులతో చర్చించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్‍ను వీడి కారెక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
సొంత పార్టీలో ఇమడలేక:
1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో పని చేశారు. 2023 ఎన్నికల్లో జగిత్యాల నుంచి బరిలో నిలిచిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ఆయన రాకను జీవన్ రెడ్డి బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జగిత్యాల కాంగ్రెస్ లో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ స్థానాలు ఇచ్చి తన వర్గానికి తక్కువ స్థానాలు ఇచ్చారనే కోపంతో జీవన్ రెడ్డి తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు జీవన్ రెడ్డికి మధ్య ఏర్పడిన విభేదాలను తగ్గించేందుకు పలు సందర్భాల్లో మంత్రుల కమిటీ రంగంలోకి దిగినా ఇష్యూ పరిష్కారం కావడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికే జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవి దక్కుతుందని జీవన్ రెడ్డి ఆశించారు. కానీ చివరకు సంజయ్ వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ గా ఎన్నిక కావడంతో జీవన్ రెడ్డి అసహానానికి గురైనట్లు సమాచారం. ఈక్రమంలో ఇక తాను కాగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నట్లు జీవన్ రెడ్డి ఇటీవల చెప్పారు. భవిష్యత్ ఏంటో గోచరించడం లేదని, అవమానాలు ఇంకెంతకాలం భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇక తన రాజకీయ భవిష్యత్ పై ఓ నిర్ణయానికి వచ్చిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకే నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది.






