- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రిటైర్డ్ ఐపీఎస్' కారు ఢీకొని.. హైదరాబాద్ లో 14 ఏళ్ల విద్యార్థి మృతి.!
హైదరాబాద్ నేరేడ్ మెట్ లోని రామకృష్ణాపురం వంతెనకు సమీపంలో వేగంగా వస్తున్న కారు ఢీకొని 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నేరేడ్ మెట్ లోని రామకృష్ణాపురం వంతెనకు సమీపంలో వేగంగా వస్తున్న కారు ఢీకొని 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఎం.శ్రీకాంత్ గా గుర్తించారు. అతను పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఐదేళ్ల క్రితమే భర్తను కోల్పోయిన అమ్ములు అనే మహిళకు శ్రీకాంత్ ఒక్కడే సంతానం. తల్లీ కొడుకులు నేరెడ్ మెట్ అనంతయ్య కాలనీలో నివాసం ఉంటున్నారు.నేరేడ్ మెట్ ఎస్సై సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో శ్రీకాంత్ రోడ్డు పక్కనే ఆగిపోయాడు. దీంతో అదే రోడ్డుపై వేగంగా వస్తున్న డి. విజయ్ కుమార్ అనే 84 ఏళ్ల రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, రోడ్డు పక్కన నిల్చున్న శ్రీకాంత్ ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. అయితే శ్రీకాంత్ తండ్రి కూడా.. ఐదేళ్ల క్రితం చెట్టుపై నుండి పడి చనిపోవటంతో, ఇప్పుడు శ్రీకాంత్ బాధ్యత ను అమ్ములు చూసుకుంటుంది. ఇప్పుడు అమ్ములకు ఉన్న ఒక్కగానొక్క తోడు, తన కుమారుడు శ్రీకాంత్ కూడా ఈ విధంగా ప్రమాదం భారినపడి చనిపోవడంతో.. నేరేడ్ మెట్ లోని వారి ఇంటి వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి.






