- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Good News: త్వరలో 850 పోస్టులు భర్తీ చేస్తాం.. సభలో మంత్రి దామోదర ప్రకటన
ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపడటంతో చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగిందని మంత్రి దామోదర చెప్పారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) వెల్లడించారు. ఈ మేరకు శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ దవాఖానాల్లో వెంటిలేటర్ల విషయంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Government Hospitals) సుమారు 1790 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపడటంతో చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగిందని చెప్పారు. ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ బెడ్ల విషయంలో పెరిగిన అవసరాలకు అనుగుణంగా మరో 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం వంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
త్వరలో 850 పోస్టుల భర్తీ:
నిమ్స్‌కు కెపాసిటీకి మించి పేషెంట్లు వస్తున్నారని మంత్రి చెప్పారు. చివరి నిమిషంలో ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల నుంచి వెంటిలేటర్ మీద నిమ్స్‌కు వచ్చే పేషెంట్ల సంఖ్య ఎక్కువైందన్నారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా నిమ్స్‌లో అదనంగా మరో 125 వెంటిలెటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిమ్స్‌లో కొత్తగా సుమారు 850 పోస్టులను భర్తీ (850 Job Vacancies) చేయబోతున్నామని గాంధీ, ఉస్మానియా, ఆదిలాబాద్ రిమ్స్, ఎంజీఎంలో మాత్రమే ఎంఆర్‌ఐ యంత్రాలు ఉన్నాయి. మరో 9 ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎంఆర్‌ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. గతేడాది కొత్తగా 213 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో ఎమర్జన్సీ రెస్పాన్స్ 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గిందన్నారు. ఈ ఏడాది మరో 79 కొత్త అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఇవి అందుబాటులోకి వచ్చాక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైమ్ 10 నిమిషాలకు తగ్గుతుందన్నారు. ఈ రెండేండ్లలో కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఎగ్జిస్టింగ్ డయాలసిస్ సెంటర్లలో వందకుపైగా డయాలసిస్ మిషన్లను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మంత్రి తెలిపారు.
ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్:
రాష్ట్రంలోని ఏ పాయింట్ నుంచైనా 20 నిమిషాల ప్రయాణంలోనే డయాలసిస్ సెంటర్ ఉండేలా, ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని డయాలసిస్ పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. క్యూర్ ఏరియాలో బస్తీ దవాఖాన్లను బలోపేతం చేస్తున్నామని బస్తీ దవాఖాన్లకు ఇంతకుముందు పీహెచ్‌సీల నుంచి మందులు సరఫరా చేసేది. ఇకపై సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ నుంచి నేరుగా బస్తీ దవాఖాన్లకు పంపిణీ చేయబోతున్నామన్నారు. ఈ నిర్ణయంతో బస్తీ దవాఖాన్లలో మెడిసిన్ ఆర్టిఫిషియల్ కొరతకు చెక్ పెట్టబోతున్నామని వెల్లడించారు.






