ఎస్పీడీసీఎల్‌లో భారీ అవినీతిట! 8 మంది సిబ్బందిపై వేటు.. ఏబీసీకి ఫిర్యాదు

by Ramesh Naini |

టీజీఎస్పీడీసీఎల్‌లో అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైన 8 మంది సిబ్బందిపై మేనేజ్మెంట్ వేటు వేసింది. ఇందులో 4 గురు ఇంజనీర్లు, ముగ్గురు లైన్ మేన్లు, ఓ ఆర్టిజన్ ఉన్నారు.

ఎస్పీడీసీఎల్‌లో భారీ అవినీతిట! 8 మంది సిబ్బందిపై వేటు.. ఏబీసీకి ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఎస్పీడీసీఎల్‌లో అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైన 8 మంది సిబ్బందిపై మేనేజ్మెంట్ వేటు వేసింది. ఇందులో 4 గురు ఇంజనీర్లు, ముగ్గురు లైన్ మేన్లు, ఓ ఆర్టిజన్ ఉన్నారు. బుధవారం ఒకేసారి 8 మందిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో అవినీతికి తావు లేకుండా ఉండేందుకు మేనేజ్మెంట్ యాంటీ బ్రైబరీ సెల్‌ (ఏబీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ సెల్ కు వచ్చిన ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్‌ విభాగం విచారణ చేపట్టగా... కీలక విషయాలు వెలుగు చూశాయి. ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు, కొత్త కనెక్షన్లు, ప్యానెల్‌ బోర్డుల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు వంటి వాటికి విద్యుత్‌ ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు వెల్లడైంది. యూపీఐ ద్వారా లంచాలు స్వీకరించినట్లు ఆధారాలు లభించాయి. దీంతో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇంకా అనేక ఫిర్యాదులు..

టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఇప్పుడు దొరికిన వాళ్లంతా కేవలం చిన్న చేపలే అని ఇంకా అనేక మంది అవినీతిపరులైన అధికారులు ప్రజలను లంచాల కోసం పీడిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కార్పొరేషన్ పరిధిలో అవినీతి పరుల భరతం పట్టేందుకు గాను సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సెప్టెంబర్ 2024లో యాంటీ బ్రైబరీ సెల్‌ ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 04023454884, 7680901912 నెంబర్లను ఏర్పాటు చేశారు. ఆఫీసు వేళల్లో ఈ నెంబర్లకు ఫోన్ చేసి కార్పొరేషన్ పరిధిలో లంచం డిమాండ్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, ఇంటెలిజెన్స్ విభాగంలో కొన్ని ఫైళ్లు, చర్యలు తీసుకోవాల్సిన హెచ్ఆర్డీ విభాగంలో మరికొన్ని ఫైళ్లు పెండింగులోనే ఉండిపోయాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలతో సహా ఫైల్ సిద్ధంగా ఉన్న వారిలో ఇప్పుడు కేవలం 8 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నారని, చాలా మందిపై చర్యలు చేపట్టడం లేదని సమాచారం. అవినీతికి పాల్పడిన వారి వివరాలను కూడా అధికారికంగా విడుదల చేయకపోవడం గమనార్హం.

Next Story