77వ ఆర్ఆర్ బ్యాచ్‌ పాసింగ్ అవుట్ పరేడ్.. హాజరుకానున్న BSF డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-17 02:18:25  IST  )

ఐపీఎస్‌ 77వ ఆర్‌ఆర్‌ బ్యాచ్‌(2024)కు చెందిన ప్రొబేషనర్ల దీక్షాంత్‌ పరేడ్‌ ఇవాళ హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో జరగనుంది.

77వ ఆర్ఆర్ బ్యాచ్‌ పాసింగ్ అవుట్ పరేడ్.. హాజరుకానున్న BSF డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎస్‌ 77వ ఆర్‌ఆర్‌ బ్యాచ్‌(2024)కు చెందిన ప్రొబేషనర్ల దీక్షాంత్‌ పరేడ్‌ ఇవాళ హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఉదయం 7.35కు ప్రారంభం కానుంది. 174 ప్రొబేషనర్లతో కూడిన ఈ బ్యాచ్‌ హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో 49 వారాల మొదటి విడత బేసిక్‌ కోర్సును ఇటీవలే పూర్తి చేసుకుంది. వీరికి సంబంధించి జరగనున్న పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ దల్జీత్‌సింగ్‌ చౌదరి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ బ్యాచ్‌లో మహిళల సంఖ్య గతంలోని 73వ RR బ్యాచ్‌తో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఇక ఢిల్లీ కేడర్‌లో తొమ్మిది మంది మహిళా అధికారులు ఈ బ్యాచ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫౌండేషన్ కోర్సును పూర్తి చేసిన 77వ RR బ్యాచ్, డిసెంబర్ 9, 2024న SVPNPAలో చేరింది. అప్పటి నుంచి వారంతా 45 వారాల పాటు శారీరక, విద్యా మరియు వ్యూహాత్మక శిక్షణతో కూడిన ఫేజ్-I శిక్షణను పొందారు.

Next Story