- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు 4 కేంద్ర మంత్రి పదవులు.. లోక్ సభ ఫలితాల వేళ CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోయే ఎంపీ సీట్ల సంఖ్యపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోయే ఎంపీ సీట్ల సంఖ్యపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 9 నుండి 13 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనుకున్న ఫలితాలు రాకపోతే.. ఇక నుండి మరో రెండు గంటలు ఎక్కువ పని చేస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రంలోనూ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని రేవంత్ జోస్యం చెప్పారు. సెంట్రల్‌లో ఇండియా కూటమి పవర్‌లోకి రాగానే తెలంగాణకు నాలుగు కేంద్రమంత్రి పదవులు అడుగుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేయగా.. ఇవాళ విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సీఎం మాటలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్పష్టమైన అధిక్యాన్ని కనబర్చింది. మెజార్టీ సర్వే సంస్థలు బీజేపీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అంచనాలు వెల్లడించాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 200 సీట్లలోపే పరిమితం అవుతోందని ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టం చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 270 సీట్ల మెజార్టీ ఫిగర్ సాధించడం ఇండియా కూటమికి కష్టమని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. మరీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవుతాయో లేదో తెలియాలంటే జూన్ 4న ఫలితాల వెల్లడి వరకు ఆగాల్సిందే.






