Maha Kumbh: 30 మంది మృతి.. 60 మందికి గాయాలు.. కుంభమేళ తొక్కిసలాటపై అధికారిక వివరాలు

by Prasad Jukanti |

కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు.

Maha Kumbh: 30 మంది మృతి.. 60 మందికి గాయాలు.. కుంభమేళ తొక్కిసలాటపై అధికారిక వివరాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) మహాకుంభమేళలో తొక్కిసలాట ఘటనలో (Maha Kumbh Stampede) మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈ విషాద ఘటనలో 30 మంది చెందగా 60 మందికి పైగా గాయపడినట్లు మహాకుంభ్ డీఐజీ వైభవ్‌కృష్ణ (DIG Mahakumbh Vaibhav Krishna) వెల్లడించారు. ఇవాళ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతుల్లో 25 మంది ఆచూకీ గుర్తించామని, మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉందని చెప్పారు. బ్రహ్మ ముహూర్తానికి ముందు అర్ధరాత్రి దాటాక 1 గంట నుండి 2 గంటల మధ్య అఖారా మార్గ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారని, ఈ రద్దీ కారణంగా అవతలి వైపు ఉన్న బారికేడ్లు విరిగిపోయాయని తెలిపారు. దీంతో తొక్కిసలాట జరిగిందన్నారు. తొక్కిసలాట ఘటనలో వివరాలకు హెల్ప్ లైన్ నంబర్ 1920కి సంప్రదించాలని సూచించారు. ఇవాళ కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించలేదని స్పష్టం చేశారు.

Next Story