- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయుధాలతో సహా లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు
జార్ఖండ్ డీజీపీ సమక్షంలో ఆయుధాలతో సహా 25 మంది మావోయిస్టుల లొంగిపోయారు. ఇందులో ఆరుగురు సబ్ జోనల్, ఆరుగురు ఏరియా కమాండర్లు ఉన్నారు.

దిశ, భద్రాచలం: జార్ఖండ్‍లో 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ రాష్ట్ర డీజీపీ తదాషా మిస్త్రీ సమక్షంలో ఆయుధాలతో సహా లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు సబ్ జోనల్ కమాండర్స్, మరో ఆరుగురు ఏరియా కమాండర్స్, 13 మంది యాక్టివ్ హార్డ్ కోర్ మావోయిస్టులు ఉన్నారు. పోలీసులకు అప్పగించిన ఆయుధాలలో ఇన్సాస్ ఎల్‍ఎంజి, ఇన్సాస్ రైఫిల్, ఎస్‍ఎల్‍ఆర్, 303 రైఫిల్స్, కంట్రీ మేడ్ తుపాకులు ఉన్నాయి. లొంగిపోయిన వారందరు కోలహాన్, సరంద ప్రాంతంలో తమ కార్యకలాపాలు నిర్వహించేవారని అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారిలో మహిళా మావోయిస్టులు కూడా ఉండగా, సాగెన్ అంగారియా అలియాస్ డొకోల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై 100 కు పైగా కేసులు ఉన్నాయి. కాగా ఇంత పెద్ద ఎత్తున మావోలు లొంగిపోవడంతో జార్ఖండ్‍లో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు భద్రతా దళాలు సమిష్టిగా పని చేస్తున్నాయని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్నవారు హింసా మార్గాన్ని వీడి ప్రధాన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సీఆర్పీఎఫ్ ఐజీ సాకేత్ సింగ్ అన్నారు.






