Bathukamma song: ఇన్‌స్టాలో హల్‌చల్ చేస్తున్న 2025 కష్టాల బతుకమ్మ పాట.. వీడియో వైరల్

by Ramesh Naini |

తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలైనాయి. బతుకమ్మ పాటలు, తీరొక్క పూలతో బతుకమ్మను మహిళలు అందంగా అలంకరిస్తున్నారు.

Bathukamma song: ఇన్‌స్టాలో హల్‌చల్ చేస్తున్న 2025 కష్టాల బతుకమ్మ పాట.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో నేటి నుంచి (Bathukamma) బతుకమ్మ సంబరాలు మొదలైనాయి. బతుకమ్మ పాటలు, తీరొక్క పూలతో బతుకమ్మను మహిళలు అందంగా అలంకరిస్తున్నారు. సాంప్రదాయ పాటలతో ఊరూరా బతుకమ్మకు స్వాగతం పలుకుతూ వేడుకలు జరుపుతున్నారు. ఈ మేరకు (Instagram) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 2025 కష్టాల బతుకమ్మ అంటూ ఈ ఏడాది కష్టాల గురించి పాట రూపంలో వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. 2025 వలలో అన్ని వింతే వలలో.. ట్రంపు టారిఫు వలలో కంపు కంపాయే వలలో.. లే ఆఫ్‌లు అన్నారే వలలో.. జాబులు తీసిండ్రు వలలో.. వానాలు దంచినాయ్ వలలో.. వరదలు ముంచినై వలలో.. బంగారం పెరిగింది వలలో.. జీతం పెరగలే వలలో.. మూడు నెలలే మిగిలున్నాయి వలలో.. ముంగడ ఏముందో వలలో.. అంటూ బతుకమ్మ పాట రూపంలో పాడారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, ఆర్‌జే స్వాతి ఈ పాట వీడియోను షేర్ చేశారు. ఈ పాట వైరల్ కావడంతో నెటిజన్‌లు రకరకాలుగా కామెంట్స్ చేశారు. ఈ కష్టాల బతుకమ్మ పాటను నెటిజన్‌లు మెచ్చుకున్నారు. సూపర్ సాంగ్ అంటూ కొనియాడారు. అమెరికా నుండి అందరూ వచ్చేయండి అమ్మ.. ఇక్కడ చేసుకోండి బతుకమ్మ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. మళ్ళీ వచ్చావా సిస్టర్.. అంటూ మరో నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశారు.వైరల్ వీడియో లింక్..

Next Story