Election Code: ఆ రూ.22 కోట్ల నగదు మాకొద్దు.. అధికారుల వద్దే మూలుగుతున్న కరెన్సీ

by Prasad Jukanti |   (  Updated:2025-03-11 09:49:33  IST  )

తనిఖీల్లో పట్టుబడిన రూ. 22 కోట్లను క్లైమ్ చేసుకునేందుకు ఎవరూ ముందుకురాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

Election Code: ఆ రూ.22 కోట్ల నగదు మాకొద్దు.. అధికారుల వద్దే మూలుగుతున్న కరెన్సీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరైనా తమ డబ్బు పొగొట్టుకుంటే బాధపడిపోతుంటారు. పెద్ద మొత్తంలో డబ్బు పోతే వెతికి పట్టించాలని పోలీసులను ఆశ్రయింస్తుంటారు. కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.22 కోట్ల నగదును తీసుకువెళ్లాలని పోలీసులు చెప్పినా ఒక్కరూ ముందురు రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఇంత డబ్బు ఎక్కడిది అనుకుంటున్నారా? 2023 తెలంగాణలో (Telangana) అసెంబ్లీ ఎన్నికల (2023 Assembly Election) సందర్భంగా పోలీసులు చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహించారు. అలా చేసిన తనిఖీల్లో పట్టుబడిందే ఆ నగదు. బాచుపల్లి, గచ్చిబౌలి, హయత్ నగర్, కవాడి గూడా, కాచిగూడ ప్రాంతాల్లో పట్టుబడిన దాదాపు రూ. 22 కోట్ల నగదును అధికారులు అప్పట్లో సీజ్ చేశారు.

ఎన్నికలు పూర్తయి ఏడాదిన్నర దాటిపోయినా ఆ సొమ్మంతా ఇప్పపటికే అధికారుల వద్దే ఉన్నది. సరైన పత్రాలు చూపించి వారి వారి డబ్బు తీసుకువెళ్లే అవకాశం ఉన్నా ఒక్కరూ ముందుకు రావడం లేదట. దీంతో నిబంధనల ప్రకారం ఆ డబ్బులు ఐటీ అధికారులు సీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు తాజాగా ఆ రూ. 22 కోట్ల నగదును బినామీ యాక్ట్ కింద ఐటీ (IT) అధికారులు సీజ్ చేశారు. పలువురి వద్ద నుంచి సీజ్ చేసిన ఇంత మొత్తం డబ్బులను ఎవరూ క్లైమ్ చేసుకోకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది. సరైన పత్రాలు చూపించి క్లైమ్ చేసుకోవడం లేదంటే అదంతా అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బేనా అని ఈ విషయం తెలిసిన వారు చర్చించుకుంటున్నారు.

Next Story