జూబ్లీహిల్స్‌లో బీజేపీకి షాక్.. బీఆర్ఎస్‌లో 200 మంది కీలక నేతలు చేరిక

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్(Jubilee Hills By Election) నియోజకవర్గంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో భారీగా చేరారు. మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) వారికి కండువా కప్పి ఆహ్వానించారు.

జూబ్లీహిల్స్‌లో బీజేపీకి షాక్.. బీఆర్ఎస్‌లో 200 మంది కీలక నేతలు చేరిక
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్(Jubilee Hills By Election) నియోజకవర్గంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో భారీగా చేరారు. మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) వారికి కండువా కప్పి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ మహిళా నాయకులు కళావతి, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు బి.లక్ష్మి, రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు శైలజ, ఆర్కే లక్ష్మి, అనురాధ, మంజుల, సత్యవతితో పాటు 200 వందల మంది బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో గోపీనాథ్ ఐదు సంవత్సరాల కోసం గెలిచారు. దురదృష్టవశాత్తు చనిపోయారు. ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి. పెళ్లికాని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అందుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గోపీనాథ్ సతీమణికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగింది. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారు. భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానించే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దుర్మార్గం. కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానించే విధంగా నానా మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

విజ్ఞత మరచి విచక్షణ లేకుండా కాంగ్రెస్ మంత్రులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు విజ్ఞులు. ప్రజలు మంచి, చెడు ఆలోచిస్తారు. కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది అనేది ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయి. పెద్ద పెద్ద ఇల్లులను హైడ్రా కూలగొట్టడం లేదు. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు రెండూ బఫర్ జోన్‌లోనే ఉన్నాయి. వీటిని హైడ్రా కూలగొట్టడం లేదని హరీష్ రావు మండిపడ్డారు.

మరోవైపు.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటు చోరీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదు అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో భర్తను కోల్పోయిన సునీతని ఓడించడానికి 20 వేల దొంగ ఓట్లను క్రియేట్ చేశారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు మళ్లీ పేదలకు అందాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Next Story