విద్యుత్ ఉద్యోగులకు 17.6% డీఏ

by Muthe.Rajitha |   (  Updated:2025-12-22 12:27:48  IST  )

విద్యుత్ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది.

విద్యుత్ ఉద్యోగులకు 17.6% డీఏ
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యుత్ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు 17.6% డీఏ ఖరారైంది. ఉద్యోగుల డీఏపై ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెరిగిన డీఏ 2025 జులై 1వ తేదీ నుంచి వర్తించనుంది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 మంది ఉద్యోగులు,ఆర్టిజన్స్, పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. కాగా సర్కారు నిర్ణయంపై విద్యుత్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story