- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahakumbh Mela : మహాకుంభమేళా పారిశుధ్య కార్మికులకు 10వేల బోనస్ : యోగి
ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా(Mahakumbh Mela)లో పనిచేసిన పారిశుధ్య, ఆరోగ్య కార్యకర్తలందరికీ రూ.10,000 బోనస్ ఇవ్వనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) తెలిపారు. ఏప్రిల్ నెలలో ఉద్యోగుల ఖాతాల్లో ఈ డబ్బు జమవుతుందని సీఎం తెలిపారు

దిశ, వెబ్ డెస్క్ : ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా(Mahakumbh Mela)లో పనిచేసిన పారిశుధ్య, ఆరోగ్య కార్యకర్తలందరికీ రూ.10,000 బోనస్(10 thousand bonus) ఇవ్వనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) తెలిపారు. ఏప్రిల్ నెలలో ఉద్యోగుల ఖాతాల్లో ఈ డబ్బు జమవుతుందని సీఎం తెలిపారు. దీనితో పాటు వారికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా మొత్తాన్ని కూడా అందిస్తామన్నారు.
జనవరి 13న ప్రారంభమైన అతి పెద్ద ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళా 45 రోజులపాటూ సాగి మహాశివరాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించే పనిలో పడ్డారు అధికారులు. యోగి ఆధిత్యనాధ్, డిప్యూటీ సీఎంలు బ్రజేష్ పాఠక్, కేపీ మౌర్య, మంత్రివర్గంలోని ఇతర మంత్రులు కూడా ఆ ఘాట్ల వద్ద స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటిలో వ్యర్థ్యాలు తొలగించడంతో పాటూ..చీపురు పట్టి కాసేపు రోడ్లు శుభ్రం చేశారు.
అనంతరం ఘాట్లన్నీ పరిశీలించి మొత్తం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. అరేల్ ఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సిఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. మహాకుంభమేళాలో ఒక రోజున 15వేల మంది పారిశుధ్య కార్మికులు చీపుర్ల పట్టి క్లీనింగ్ విధులు నిర్వర్తించి ఇప్పటికే గిన్నీస్ బుక్ రికార్డు సైతం సాధించారు. గతంలో 2019లో ప్రయాగ్ రాజ్ లోనే 10వేల మంది కార్మికులు చేపట్టిన పారిశుధ్యం రికార్డును అధిగమించారు.






