హైకోర్టు యాక్టింగ్ సీజేగా జస్టిస్ ఎంఎస్ఆర్, ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి రిలీవ్

by  |
chief-justice n
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి తన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో హైకోర్టు సీజే పదవి నుంచి తప్పుకున్నారు. హైకోర్టులో సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్థాయి సీజే వచ్చేంత వరకు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు యాక్టింగ్ సీజేగా వ్యవహరిస్తారు. దాదాపు ఎనిమిది నెలలుగా హైకోర్టు సీజేగా వ్యవహరించిన జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులు కావడంతో ఆమెకు జడ్జీలు, జ్యుడిషియల్ అధికారులు, బార్ కౌన్సిల్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ అడ్వకేట్లు శుక్రవారం వీడ్కోలు పలికారు. సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్తున్నందుకు అభినందనలు తెలియజేశారు.

Next Story

Most Viewed