- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫలించిన ప్రయత్నం.. మూడు శాతం పెరిగిన పోలింగ్ పర్సంటేజీ
దిశ, సిటీబ్యూరో : పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం చేసిన కృషి కొంత వరకు ఫలించిందనే చెప్పవచ్చు. గత నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం కేవలం 46 శాతానికి పడిపోవటాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల్లోనైనా ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈసారి ముమ్మరంగా స్వీప్ కార్యక్రమాలను నిర్వహించింది. ఓటరు అవగాహన కార్యక్రమాల్లో టౌన్, స్లమ్ లెవెల్ ఫెడరేషన్లను, స్వయం సహాయక బృందాలతో పాటు స్వచ్చంద సంస్థలను భాగస్వాములను చేయటంతో పదిశాతం పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు కేవలం మూడు శాతాన్ని పెంచేలా ఫలించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 46 శాతం ఓటింగ్ శాతం నమోదు కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో 49.04 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలియజేస్తూ వివరాలను రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలకు నివేదికలను పంపినట్లు సమాచారం.
ఉదయం 7 గంటల నుంచి మందకోడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మందగించి, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఊపందుకున్నందుకే 3 శాతం అధికంగా ఓటింగ్ నమోదైనట్లు అధికారులు గుర్తించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నమోదైన పోలింగ్ శాతాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతంతో బేరీజు వేస్తూ పోలింగ్ శాతం తగ్గిన అసెంబ్లీ సెగ్మెంట్లను గుర్తించి, ఆయా నియోజకవర్గాల్లో మున్ముందు జరిగే ఎన్నికల్లో ఓటరు అవగాహన, హోం ఓటింగ్, పోల్ క్యూ రూట్ వంటివి మరింత ముమ్మరంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల యంత్రాంగం భావిస్తున్నట్లు సమాచారం. మున్ముందు జరిగే ఏ ఎన్నికల్లోనైనా ఓటరు అవగాహన, చైతన్య కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నట్లు నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం.