- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్.. ప్రధానం కారణం అదే!
దిశ, వెబ్‌డెస్క్: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నిరసనలు, ధర్నాలు చేపట్టున్నారు. ఆయా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుతెప్పలుగా ధాన్యం రాశులు ఉన్నాయని, వాటిని వెంటనే కొనుగోలు చేయకుండా.. సర్కార్ కాలయాప చేస్తుందని బీఆర్ఎస్ అధినేత మండిపడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షాల కారణంగా తడుస్తుంటే రైతులను ఏ మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గులాబీ బాస్ ఫైర్ అయ్యారు. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించిందని, ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే సీఎం బోనస్ ఇస్తామని చెప్పడడం అన్నదాతలను మోసం చేస్తున్నట్లు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ అధినేత పిలుపునిచ్చారు.