తెలంగాణలో కొత్తగా 1,440 కరోనా కేసులు

by  |
తెలంగాణలో కొత్తగా 1,440 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య దోబుచులాడుతోంది. ఓ రోజు కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుండగా, మరోసారి తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో 1,440 కరోనా కేసులు నమోదు కాగా, చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,890 యాక్టివ్ కేసులుండగా, 2,29,064 మంది చికిత్స అనంతరం ఆరోగ్యంగా డిశ్చార్జి అయ్యారు. అలాగే, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 278 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులు కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల 2,50,331 చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 1377కు చేరుకుంది.


Next Story

Most Viewed