ఎలక్ట్రిక్ వాహన తయారీ కేంద్రంగా తెలంగాణ : కేటీఆర్

40

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంగా తీర్చిదిద్దుతామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఎలక్ట్రిక్ వాహనాల శిఖరాగ్ర సదస్సులో భాగంగా మంత్రి నూతన విధానాన్ని విడుదల చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల విస్తృతికి సహకారం, భాగస్వామ్యంపై జరిపిన చర్చలో మంత్రి కేటీఆర్ మాట్లాడగా.. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా నీతిఅయోగ్ సీఈవో అమితాజ్ పాల్గొన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలు అందిస్తామని.. రాష్ట్రంలోనే కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రాయితీలు ప్రకటిస్తామన్నారు. రూ.200కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన పరిశ్రమలు, మెగా ప్రాజెక్టులకు పెట్టుబడుల్లో 25 శాతం రాయితీలు ఇస్తామన్నారు. విద్యుత్ చార్జీలు, స్టాంప్, రిజిస్ట్రేషన్ ఫీజులపై రాయితీలతో పాటు మొదటి 2 లక్షల బైకులకు రోడ్ టాక్స్ మినహాయింపు ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.